ఈరోజు మధ్యాహ్నం సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆది శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ తన సిబ్బందితో కలిసి గొల్లపల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా గొల్లపల్లి వైపు ఇసుకలోడుతో ఒక పికప్ వ్యాన్ రాగా దానిని ఆపి ఇసుక తరలించడానికి సంబంధించిన పర్మిషన్ లేనందున, పికప్ డ్రైవర్ & ఓనరు అయినా గంతుల సత్తయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు. విచారణలో అతను ఎలాంటి ఇసుక ను పర్మిషన్ లేకుండా నారాయణపూర్ గ్రామంలో ఉన్న మానేరు వాగులో ఇసుక నింపుకొని దానిని కామారెడ్డికలో అమ్మడానికి వెళ్తున్నానని తెలిపాడని దాంతో SHO ఆది శ్రీనివాస్ రావు వాహనాన్ని, సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొని రాగా ఎస్ఐ ఎన్ రమాకాంత్, గంతుల సత్తయ్య పై కేసు నమోదు చేసి పికప్ వ్యాన్ నెంబర్ TS-23- T-6565.ను సీజ్ చేశారు.