హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లోని సెంట్రల్ లైబ్రరీలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకమైన డాక్టర్ రియాజ్ ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ సంఘాల నాయకులు, రియాజ్ అభిమానులు కార్యక్రమంలో పాల్గొని శాలువాలు పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఆల్ బీసీ మైనారిటీ జాతీయ అధ్యక్షులు మహమ్మద్ షుకురోద్దీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అంకూస్, జాతీయ కోశాధికారి ఖజామియా, జాతీయ కార్యదర్శి మహమ్మద్ నసీరోద్దీన్ లు పాల్గొని చైర్మన్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా లైబ్రరీల అభివృద్ధికి, గ్రామస్థాయిలో లైబ్రరీలో ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా చైర్మన్ ను కోరారు. దీనికి రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ సానుకూలంగా స్పందించారు.