కరీంనగర్ గ్రంధాలయం సంస్థ చైర్మన్ గా నియమితులైన సత్తు మల్లయ్య పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భముగా టి ఎన్జీవోల జిల్లా అద్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి, సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, ఒంటెల రవీందర్ రెడ్డి, రాజేశ్వరరావు, మల్కా రాజేశ్వరరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి శంకర్, రాజ మల్లయ్య, సరిత, అనిల్ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు