Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAమల్యాల నుండి కాచారం వరకు రూ.25 కోట్లతో డబుల్ లేన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన...

మల్యాల నుండి కాచారం వరకు రూ.25 కోట్లతో డబుల్ లేన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన బండి సంజయ్

పగలు, పంతాలు, రాజకీయ కక్షలతో సాధించేదేమీ లేదు కార్యకర్తలు కొట్టుకోవడం గొడవలు పడటం తప్ప ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తరువాత రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసి అభివ్రుద్ధి చేసుకుందాం ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దాం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రోటోకాల్ పాటించలేదని కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా దారి మళ్లించిందని కమీషన్లు, పేరు ప్రఖ్యాతులకే ప్రాధాన్యమిచ్చిందే తప్ప నిబంధనల ప్రకారం పనిచేయలేదని అధికారులను కూడా పనిచేసుకోనివ్వలేదని అన్నారు. చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి రూ.25 కోట్ల రూపాయల వ్యయంతో మల్యాల చౌరస్తా నుండి కాచారం వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా నేతలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాన్ని పూర్తి చేయడాన్ని గమనించిన బండి సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం చాలా రోజుల తరువాత ప్రోటోకాల్ ను పాటించడం కన్పించింది ఇది మంచి వాతావరణం అధికారులు కూడా ఆనందంగా ఉన్నారు గతంలో ఎట్లుందో మీరు చూశారు గత బీఆర్ఎస్ పాలనలో ప్రోటోకాల్ పాటించలేదు నిబంధనలను ఉల్లంఘించి కమీషన్లకే పరిమితమై పనులు చేయలేదు, నిబంధనలు పాటించలేదు, అధికారులను కూడా పని చేయకుండా ఒత్తిడి తెచ్చారు. పేరు ప్రఖ్యాతులకే బీఆర్ఎస్ ప్రాధాన్యతనిచ్చింది కమీషన్లు దండుకున్నారు గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధులను దారి మళ్లించారు. ఎన్నికల వరకే రాజకీయాలు నియోజక వర్గ అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలన్నదే మా అభిమతం ఈసారి కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగమయ్యేలా ఈరోజు మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులను మల్యాల నుండి కాచారం వరకు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు.

రోడ్డు విస్తరణ కోసం నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, నితిన్ గడ్కారీ కి ప్రత్యేక కృతజ్ఞతలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గడ్కరీ అత్యధిక నిధులు మంజూరు చేశారని తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా సీఆర్ఐఎఫ్ నిధులు కేటాయించారని మోదీకి గడ్కరీకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. పగలు పంతాలతో సాధించేదేమీ లేదు కార్యకర్తలు కొట్టుకోవడం గొడవలు జరగడం తప్ప జరిగేదేమీ లేదు గొడవలు పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఈ రోడ్డు విస్తరణ పనుల విషయంలో సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments