రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో శుక్రవారం రాత్రి జరిగిన రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం కు వెళ్తున్న భక్తుల పై ఓ పిచ్చి కుక్క దాడి చేయగా ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న మణెమ్మ , బండలింగంపల్లి కి చెందిన మంగవ్వ,పదిర కు చెందిన బూదవ్వ, గొల్లపల్లి కి చెందిన ముద్రకొల తేజ, నారాయణపూర్ కు చెందిన ఐజాక్ గోరంట్యాల్ కు చెందిన ప్రశాంత్, గొల్లపల్లి కి చెందిన రహమాన్ లను పిచ్చి కుక్క కాటు వేయడంతో రక్త గాయాలు అయ్యాయి. ఎల్లారెడ్డి పేటలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం లో వైద్యులు ప్రదీప్ కుమార్ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పండగ పూట భక్తులను కుక్క కాటు వేయడంతో ఎల్లారెడ్డి పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధితులను స్థానిక మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ పరామర్శించారు. జాతరకు వచ్చే భక్తులు వీది కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.



