గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ, ఆయన భార్య ఆలియా మధ్య నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే. నవాజుద్దీన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఆమె కేసు కూడా పెట్టింది. ఆ విషయం ఇంకా కోర్టులోనే ఉంది. ఈ తరుణంలో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఈ విషయంపై స్పందించింది. నవాజ్ గురించి వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని షేర్ చేసింది.
కంగనా షేర్ చేసిన స్టోరీలో.. ‘ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది.. నవాజ్ సర్‌ని తన ఇంటికి రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన్ని అవమానిస్తున్నారు. ఆయన తన కుటుంబం కోసం సర్వస్వం ధారపోశాడు. కొన్నాళ్లుగా అద్దె ఇంట్లో ఉన్నాడు. రిక్షాలో టీకూ వెడ్స్ షేర్ షూట్‌కి వెళ్లేవాడు. గత ఏడాది ఆయన ఈ బంగ్లాను కొనుకున్నాడు. ఈ సమయంలో ఆయన మాజీ భార్య వచ్చి ఆ ఇల్లు తనదని క్లెయిమ్ చేయడానికి వచ్చింది.
ఇప్పటి వరకు నవాజ్ సర్ సంపాదించినదంతా ఆయన సోదరులకి, ఆయన చాలా సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న మాజీ భార్యకు ఇచ్చాడు. ఆమె పిల్లలతో కలిసి దుబాయ్‌లో ఉంటోంది. మాజీ భార్య కోసం ఆయన ముంబైలో ఫ్లాట్ కూడా కొన్నాడు. అలాగే తల్లి కోసం ఒక బంగ్లా కొన్నాడు. దాని కోసం నా దగ్గర చాలా హౌస్ డిజైనింగ్ చిట్కాలు తీసుకున్నాడు. ఆ ఇంట్లో మేము పార్టీ కూడా చేసుకున్నాం.