కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల పై చర్యలు తీసుకోవాలని పుండు ఒకటైతే మందు ఒకటి అన్న చందగ జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల పని తీరు అని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం.దినకర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అర్వులైన వైద్యులు అందుబాటులో లేకున్నా ధనార్జనే ధ్యేయంగా కొందరు ఆసుపత్రులు ఎర్పాటు చేసి అమాయక ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారన్నారు. డబ్బులు పోయిన ప్రాణాలైనా దక్కుతున్న యా అంటే అది లేదు ఇష్టరాజ్యాంగ పరీక్షలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో మొత్తం 27 ఆసుపత్రులు ఉండగా అందులో కొన్ని ఆసుపత్రులకు అనుమతులు కూడా లేవని తెలిపారు. కొన్ని ఆసుపత్రులు వైద్య శాఖ నిబంధనలు కూడా పాటించడం లేదు అంతే కాకుండా ఆసుపత్రిలో నిపుణులైన స్త్రీ వైద్య నిపుణులు మాత్రమే మహిళలకు గర్భిణులకు ప్రసుతు సేవలు అందించాలి కానీ జిల్లాలో కొన్ని ఆసుపత్రులలో పిల్లల వైద్య నిపుణులు.జనరల్ ఫిజీసియిన్ ఆర్థోపెడిక్ తదితర వైద్యులు కూడా గర్భిణులకు ప్రసూతి వైద్య సేవలు చేస్తున్నారు ఇది పూర్తిగా వైద్య శాఖ నిబంధనలకు విరుద్ధం అయిన జిల్లాలో ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని రెండు రోజుల క్రితం వైద్యం వికటించి ఒక గర్భిణీ స్త్రీ మరణించడం జరిగిందని ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరిగాయి కానీ జిల్లా అధికారులు తనిఖీలు లేవు జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల పై చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నా మని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గెడం. టికనంద్ నాయకులు దుర్గం నిఖిల్.తిరుపతి ఉన్నారు.