77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇండోర్ క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ సర్పంచ్ బైతి దుర్గమ్మ ఆధ్వర్యంలో, వార్డు సభ్యుల సహకారంతో, గ్రామపంచాయితీ నిధులతో చేపట్టారు. విద్యార్థుల శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మామిండ్ల కానుకవ్వ శ్రీనివాస్‌తో పాటు వార్డు సభ్యులు బద్ధ రాములు, చిర్రం మహేష్, రూప, కొమ్మెట రాజు, కొమ్మెట రాజలింగయ్య, అంతడుపుల మంజుల దేవయ్య, కొండం విష్ణు, జంపెల్లి తిరుపతి, గోక దివ్య స్వామి, పాఠశాల చైర్మన్ పల్లె పూజిత, ప్రధానోపాధ్యాయులు వినీల, బైతి నవీన్ గ్రామ ప్రజలు, ఆశా వర్కర్లు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు


