రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గాలివాన భీభత్సవానికి చెట్టు నేలకూలాయి వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోన్నారు. వర్షం అంతంత మాత్రమే కురిసింది. నారాయణపూర్ నుండి రాగట్లపల్లి వెళ్లే ప్రదాన రహదారిలో గాలి వాన భీభత్సనికి చెట్లు నేలకూలాయి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలింది. అదేవిధంగా పదిర బ్రిడ్జి సమీపంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన దారిలో అదేవిధంగా వెంకటాపూర్ ఆది పెరుమండ్ల స్వామి ఆలయం సమీపంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి పై చెట్లు విరిగిపోయి వాహాన రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వెంకటాపూర్, పదిర నారాయణపురం గ్రామాలలో పోలీసులు, గ్రామపంచాయతీ సిబ్బంది, సెస్ సిబ్బంది విరిగిపోయిన చెట్లను తొలగించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు