రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకను శనివారం ఘనంగా జరుపుకున్నారు. మొదటగా ఎల్లారెడ్డిపేట స్థానిక సాయిబాబా ఆలయంలో జన్మదినం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభిషేకం కార్యక్రమం నిర్వహించి అనంతరం స్థానిక జడ్పిటిసి కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, మండల అధ్యక్షులు కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశరాం గౌడ్, ఎనగందుల అనసూయ నర్సింలు, ఎస్టి సెల్ అధ్యక్షులు సీత్యానాయక్, ఎస్సి సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్, మండల కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిస అజ్జు, మండల ఉపాధ్యక్షులు ఆకుల మురళి గౌడ్, సీనియర్ నాయకులు మీసం రాజం, నంది కిషన్, బందారపు బాల్రెడ్డి, ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, రాగం ఎల్లయ్య, తదితరులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు