రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఈజీఎస్ క్రింద కోటి రూపాయలు మంజూరైనట్టు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య తెలిపారు. బొప్పాపూర్ గ్రామపంచాయతీకి రెండు అంగన్వాడి కేంద్రాలు గొల్లపల్లి గ్రామానికి రెండు అంగన్వాడీ కేంద్రాలు రాజన్నపేట గ్రామానికి ఒక అంగన్వాడీ కేంద్రం మంజురు అయిందని ఒక్కో అంగన్వాడి కేంద్రానికి 12 లక్షల చొప్పున మంజూరు అయినట్టు తెలిపారు
