గూడూరు గ్రామానికి చెందిన చెక్కపల్లి నరసింహులు s/o కొండయ్య 45సంవత్సరాలు అనునతడు తాగుడుకు అలవాటు పడి ప్రతిరోజు తాగడం వలన తన భార్య వదిలిపెట్టి పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది అని ఇంకా ఎక్కువ తాగుతూ భార్య రావటం లేదని బాధపడుతూ ఉండేవాడని తేదీ 27/ 4/24 రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు తన అన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి తన అన్న తాగుడుకు బానిసై భార్య రావటం లేదని జీవితంపై విరక్తి చెంది 3 రోజుల క్రింద తన ఇంట్లో ఫ్యానుకు ఉరి పెట్టుకొని చనిపోయినాడు అని మృతుని తమ్ముడు చెక్కపల్లి బాబు s/o కొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముస్తాబాద్ ఎస్సై K. శేఖర్ రెడ్డి తెలిపినారు.