విజయనగరం జిల్లా పోలీస్ బాస్, ఎస్పీ దీపిక ప్రపధమంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని 33 డివిజన్ లో ఎంఎస్ఎన్ కాలేజీలో క్యూ లైన్ లో ఓ సాధారణ ఓటరుగా అధికార దర్పం ప్రదర్శించకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎస్పీ దీపిక. ముందు రోజు ఒక ప్రాంతంలో ఎస్పీ ఓటేస్తారని తెలిసినప్పటికీ సరిగ్గా పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి అది కాస్త మారడంతో సరిగ్గా ఏడుంపావుకే ఎస్పీ దీపిక పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
