ఎల్లారెడ్డిపేటలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2024 విద్యా సంవత్సరంలో పదోతరగతి వార్షిక పరీక్షలో 9.0 జిపిఎ తో ఉత్తీర్ణుడైన ఎల్లారెడ్డిపేట మండల తెలంగాణ ప్రభ తెలుగు దినపత్రిక విలేకరి చేట్కూరి కృష్ణ మూర్తి గౌడ్-రేఖ దంపతుల కుమారుడు చెట్కూరి అఖిల్ గౌడ్ ను ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్, సీనియర్ జర్నలిస్టు బండారి బాల్రెడ్డిలు కలిసి శాలువాలు కప్పి ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మజీద్ , సీనియర్ జర్నలిస్టు బండారి బాల్ రెడ్డి లు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన జర్నలిస్టు సోదరుడు కృష్ణమూర్తి గౌడ్ రేఖలు కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు కుమారులను చదివిస్తున్నారని పెద్ద కుమారుడైన అఖిల్ గౌడ్ 2024 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసి వార్షిక ఫలితాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పురుషుల విభాగం నుండి 9.0 ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచినందుకు ప్రోత్సాహించేందుకు ప్రెస్ క్లబ్ తరఫున ప్రెస్ మిత్రుడు చేటుకూరి కృష్ణమూర్తి గౌడును అతని తనయుడు అఖిల్ గౌడ్ లను సన్మానించామని వారు తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్షలో కూడా ప్రథమ స్థానంలో రాణించాలని చదువులు నేర్పిన గురువులతో పాటు తల్లిదండ్రులకు ప్రెస్ క్లబ్ కు పేరు తేవాలని వారు పిలుపునిచ్చారు. రంగీనేని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్ ప్రవేశ పరీక్షల్లో 80 శాతం మార్క్ లకు పైగా సాధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉచిత విద్యను పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో జర్నలిస్టులు కొండ్లెపు జగదీష్, చింతకింది శ్రీనివాస్ గౌడ్, శామంతుల అనిల్ కుమార్, కట్టెల బాబు, శ్రీధర్ గౌడ్, మోహిజ్, మనోజ్ కుమార్ యాదవ్, కట్టెల సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు