జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ( డి ఎం & హెచ్ ఓ) లకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే పేషెంట్ ప్రెగ్నెన్సి పరిక్షకు వెళ్ళగా థైరాయిడ్ మరియు ఇతర టెస్టుల కోసం రక్తం షాంపిల్స్ ఇచ్చారు. ఒక వారం రోజుల తరువాత రిపోర్ట్స్ వస్తాయని తెలిపారు. 06-04- 2024 రోజున రక్త నమూనాలు తీసుకున్నారు. వారం తరువాత హాస్పటల్ కు వెళ్ళి వైద్య సిబ్బందిని రిపోర్ట్స్ అడుగగా ఇంకా రాలేదని నిర్లక్ష్య సమాదానం చెప్పారు. ఇలా రోజు వెళ్లి అడుగగ ఇంకా రిపోర్ట్స్ రాలేదని చెప్పారు. తేది 24-04-2024 బుధవారం రోజున హాస్పటల్ కు వెళ్ళి హాస్పటల్ సిబ్బందిని రిపోర్ట్స్ గురించి ఎందుకు ఇలా తిప్పించుకుంటున్నారని అడగగా మీ రక్త నమూనాలు మిస్ అయ్యాయని మల్లీ రక్త నమూనాలు ఇవ్వాలని మల్లీ టెస్టులకు పంపిస్తామని నిర్లక్యంగా వ్యవహరిస్తూ. తమపై దురుసుగా ప్రవర్తించారని. పేద ప్రజలను టెస్టుల పేరుతో దోచుకుంటున్న మమత హాస్పటల్ పై. చట్ట పరమైన చర్యలు తీసుకొని తనకు జరిగిన అన్యాయానికి, న్యాయం చేయాలని బాధిత దంపతులు గురువారం జిల్లా కలెక్టర్, వైద్య అధికారికి ఫిర్యాదు చేశారు.