కంటోన్మెంట్ బోర్డ్ కొత్త ప్రెసిడెంట్ గా నియమితులైన బ్రిగేడియర్ రాజీవ్ నేడు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భముగా నిర్వహించిన కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన సాధారణ బోర్డు మీటింగ్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని బాధ్యతలు తీసుకున్న బ్రిగేడియర్ రాజీవ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
కంటోన్మెంట్ బోర్డు అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కంటోన్మెంట్ ప్రాంతంలో నీటి సరఫరాకు సంబంధించి వాటర్ బోర్డ్ సరఫరా చేసే 1 ఎంజిడి అదనపు నీటిని నిలువ చేసుకునే సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని , అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్లు నిర్మించడానికి సిద్దంగా ఉన్న నేపధ్యంలో అనువైన ప్రాంతాలను గుర్తించి నివేదిక అందించాలని రామన్నకుంటను అభివృద్ది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని బోర్డు నుంచి ఎన్వోసి ఇవ్వాల్సి ఉందని ఎమ్మెల్యే బోర్డు మీటింగ్ లో ప్రస్తావించారు.
ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఓ సారి ఎన్నికలు జరగాలని, కంటోన్మెంట్ లో గత ఐదేళ్లుగా ఎన్నికలు జరగకుండా నిమినేటెడ్ సభ్యులతో పాలన సాగుతోందని కంటోన్మెంట్ లో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అందుబాటులో ఉంటే ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని కంటోన్మెంట్ లో బోర్డు ఎన్నికలు జరిపించేలా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే బోర్డ్ ప్రెసిడెంట్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్, కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ రాజీవ్, సిఇవో మధుకర్ నాయక్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద, ఇతర బోర్డు అధికారులు పాల్గొన్నారు.


