జాతీయ బీసీ యువజన సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన మానుక రాజు యాదవ్ ను స్థానిక యాదవ సంఘ నాయకులు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం యాదవ సంఘ భవనంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు ముద్దం వెంకటి యాదవ్, ఒగ్గు మహేష్ యాదవ్, ముద్దం శ్రీనివాస్ యాదవ్ లు మానుక రాజు యాదవ్ కు శాలువ కప్పి సన్మానించారు.

