కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నాలుగు వరుసల రహదారి కి బైపాస్ లేకపోవడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ఉన్న గుండి లింకు రోడ్డుకు సరైన సౌకర్యం లేదు, గతంలో బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదానికి సర్వీస్ రోడ్లుగా గుండి ఇచ్చారు, ఆ రోడ్డు గుండ వెళ్లాలంటే గుంతలో పడాల్సిందే రోడ్డు మొత్తం దుమ్ము ధూళితో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుంది. గతంలో డి బి ఎల్ కంపెనీ వారు బై పాస్ కు లింక్ అయిన గుండి రోడ్డుకు బి టీ చేస్తామని సర్వీస్ రోడ్డు ఇస్తామని అన్నారు, ఇప్పుడు చేతులు దులిపేసుకొన్న డి బి ఎల్ కంపెనీ యాజమాన్యం వెళ్లి పోయారు, వారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని తక్షణమే బైపాస్ కు లింక్ అయిన రోడ్డు కు బి టీ వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ తరఫున కోరుతున్నామన్నారు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్