Sunday, September 8, 2024
spot_img
HomeTELANGANAహైదరాబాద్‌లో మరో మహిళపై అత్యాచారం.. హత్య?

హైదరాబాద్‌లో మరో మహిళపై అత్యాచారం.. హత్య?

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు మంగళవారం పోలీసులకు తెలిసింది,మహిళపై అత్యాచారం చేసి అనంతరం బండరాయితో మోది దుండగులు కిరాతకంగా హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, మృతురాలిని గౌలిదొడ్డిలోని కేశవనగర్‌కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనంలోకి మృతురాలు వేస్ట్ మెటీరియల్ తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 25 నుండి మహిళ కనబడటం లేదని పీఎస్‌లో మిస్సింగ్ కేస్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments