హైదరాబాద్: మమ్మల్ని ఎవరు నిర్బంధించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. చంపేస్తామంటూ తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాలరాజు తెలిపారు. రక్షణ కోసమే మమ్మల్ని ప్రగతిభవన్‌లో ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే ప్రగతిభవన్‌లో ఉన్నామని, మమ్మల్ని ఇబ్బందిపెట్టే ఎవరినీ వదిలిపెట్టమని ఎమ్మెల్యే బాలరాజు హెచ్చరించారు. కేసీఆర్ వదిలిన బాణంగా పనిచేస్తామని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.