Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAస్మశాన వాటికలో వసతులు కరువు: శ్యామ్ కుమార్…

స్మశాన వాటికలో వసతులు కరువు: శ్యామ్ కుమార్…

దీపావళికి హిందూ స్మశాన వాటికలో తమ తమ సంప్రదాయం ప్రకారం పౌరులు తమ పితృ దేవతలకు పూజలు చేస్తుంటారు. గతంలో బోర్డు మెంబర్ గా ప్రభుత్వం ద్వారా స్మశాన వాటికను శుబ్రం చేయించే వాళ్ళం ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించి చెత్త లేకుండా చేసి జెనరేటర్ ద్వారా స్మశాన వాటికలో లైటింగ్ ఏర్పాటు చేసి దీపావళి కీ స్మశాన వాటికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పితృదేవతలకు పూజలు చేయడానికి వచ్చే పౌరులకు సిద్దంగా ఉచ్చేవాళ్ళం అన్నారు శ్యామ్ కుమార్. తిరుమలగిరి విలేజ్ పెద్ద కమేల, చిన్న కమేల, శాస్త్రి నగర్, సెంట్రల్ బట్టి ఆర్కె పురం తదితర ప్రాంతాల నుంచి తమ పితృ దేవతలకు పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. వారికి మెరుగైన వసతులు కల్పించడంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారని స్మశాన వాటికలో చీకటిగా ఉండడంతో పాటు సమాధుల వద్ద ఏపుగా పెరిగిన మొక్కలు చెత్త వలన పూజలు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇకనైన స్తానిక కాంగ్రెస్ నాయకులు పట్టించుకుని స్మశాన వాటికలో మెరుగైన వసతులు కల్పించాలి కోరారు శ్యామ్ కుమార్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments