ఈరోజు సాయంత్రం సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, హెడ్ కానిస్టేబుల్ వచ్చిన నమ్మదగిన సమాచారంపై పోలీస్ సిబ్బంది అయిన సతీష్, మహేందర్, శ్రీకాంత్ లతో కలిసి అక్కపల్లి గ్రామశివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్కపల్లి గ్రామం వైపు నుండి ఇసుకలోడుతో TS.23.T.8683 గల ఒక వాహనం రాగా దానిని ఆపి ఇసుక తరలించడానికి సంబంధించిన అనుమతులు లేనందున, వాహనం డ్రైవర్ గొల్లపల్లి గ్రామానికి చెందిన అలకుంట రాజు ఇసుకను పర్మిషన్ లేకుండా అక్కపల్లి గ్రామంలో ఉన్న వాగు నుండి నింపుకొని దానిని కామారెడ్డిలో అమ్మడానికి వెళ్తున్నామని తెలిపారు. వెంటనే శ్రీనివాస్ రావు వాహనాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి వివరాలు తెలపగా ASI బి.కిషోర్ రావు డ్రైవర్ పై, గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓనరు ఆలకుంట శేఖర్ పై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం, గతంలో ఇద్దరు నిందితులు అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల వారిపై పోలీస్ స్టేషన్లో పాత కేసులు ఉన్నందున వారి ఇద్దరినీ, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు సిరిసిల్ల కోర్టుకు రిమాండ్కు తరలించగా, సిరిసిల్ల కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించామన్నారు ఏఎస్ఐ బి.కిషోర్ రావు