ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.యస్.షర్మిల జన్మదినం సందర్భంగా సత్యసాయి జిల్లా డిసిసి అధ్యక్షులు యం.యచ్.ఇనయతుల్లా, హిందూపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ యం.ఇ. కిపాయతుల్లా ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మ దినం వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇనాయతుల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆచితూచి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ధీటైన నాయకురాలిని పిసిసి అధ్యక్షురాలుగా నియమించడం తెలుగు ప్రజల అదృష్టం అని రాబోవు కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన తథ్యం అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ కిఫాయతుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గోన్నారు.



