ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ఎంఐఎం నాయకులు కృతజ్ఞతలు తెలపడం సిగ్గుచేటు
బిజెపి భయంతో పదేండ్లు హలీం వ్యాపారుల పొట్ట కొట్టిన నీచ చరిత్ర ఎమ్మెల్యే కమలాకర్ ది
మానవతా దృక్పథంతో హలీం వ్యాపారానికి అనుమతి ఇప్పించిన ఘనత మంత్రి పొన్నం ప్రభాకర్ ది
బండి సంజయ్ భయానికి ఒక్క ముస్లిం కాలనీ పేరు స్మార్ట్ సిటీ బోర్డులపై వ్రాయించలేదు
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూలో ఒక్కటంటే ఒక్క బోర్డు కనిపించకుండా చేశారు
కరీంనగర్ జిల్లా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగరంలో హలీం స్టాల్ ఏర్పాటు కోసం అనుమతి ఇప్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అని కానీ MiM నాయకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇప్పించారని చెప్పడం హాస్యాస్పదమని సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు గత 5,6 సంవత్సరాల నుండి హలీం స్టాల్ గ్రాండ్ హోటల్ ముందు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తే అది ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు అని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎంఐఎం నాయకులకు జోకుడు రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ప్రజలను తప్పుదోవ పట్టించాలని హెచ్చరించారు.
బిజెపి పార్టీ భయంతో, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేరు చెప్పి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గత పది సంవత్సరాలుగా హలీం వ్యాపారులను, రోడ్లపై షాపులు తొలగించి, వారి పొట్ట కొట్టారని, వివిధ కుంటి సాకులు చెబుతూ, నెల రోజులపాటు వారి వ్యాపారాన్ని పూర్తిగా గత 10 ఏండ్లుగా క్షీణించేటట్లు వ్యవహరించారని, అలాంటి నీచ చరిత్ర కలిగిన ఎమ్మెల్యే కమలాకర్ కు, ఎంఐఎం నాయకులు కృతజ్ఞతలు తెలపడం సిగ్గుచేటని అబ్దుల్ రెహమాన్ విమర్శించారు. కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ బోర్డులపై సూచికల బోర్డులపై ఎక్కడ ముస్లిం కాలనీల పేర్లు కనిపించవని, ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్నామని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పి ఆచరణలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు.
బిజెపి భయంతో, బండి సంజయ్ రాజకీయంగా ఎక్కడ లబ్ది పొందుతాడోనని, గంగుల కమలాకర్ ఒక వర్గం ఓట్ల కోసం, కుట్రలతో కరీంనగర్లో ముస్లింల ఆనవాళ్లు లేకుండా చేయాలని చేశారని మండిపడ్డారు. మానవతా దృక్పథంతో మంత్రి పొన్నం ప్రభాకర్ హలీం వ్యాపారుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ తో మాట్లాడించి అనుమతి ఇప్పించారని ఇందులో గంగుల కమలాకర్ ఘనకార్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్, నగర మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ అఖీల్ వద్దకు, హలీం వ్యాపారులు అనుమతి ఇప్పించాలని వస్తే, వారు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి అనుమతి ఇప్పించారని పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ కార్యాలయాల బోర్డుపై ఉర్దూ లో వ్రాసి ఉన్నట్లు కనిపించదన్నారు. ఇప్పటికైనా ఎంఐఎం నాయకులు గంగుల కమలాకర్ కు అనుకూలంగా అడుగులకు మడుగులు తడం మానుకోవాలని ఇలాంటి చౌకబారు ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలని హితువు పలికారు. ముస్లింల వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేసినటువంటి వ్యక్తులకు, ప్రజా ఆమోదం పొందనటువంటి వారికి ఎంఐఎం నేతలు కరీంనగర్ లో ఇప్పటికైనా చరమ గీతం పాడి, తమ చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆమెర్, నాయకులు సిరిపురం నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.