Sunday, September 8, 2024
spot_img
HomeANDHRA PRADESHపర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఆమంచి

పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఆమంచి

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళ వారం ప్రకటించింది. సుమారు ఏడాదిన్నర నుంచి పర్చూరు విషయంలో నెలకొన్న అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఆమంచిని ఇన్‌చార్జిగా ప్రకటించటంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంధిగ్ధతకు తెరపడింది. మొదట చీరాల, పర్చూరు నియోజకవర్గాలకు సంబంధించి ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను సరి చేసేందుకు అధిష్ఠానం పలుమార్లు చేసిన ప్రయత్నాలు ఫలప్రదం కాలేదు.

ఒక దశలో ఆమంచి నియామకాన్ని అడ్డుకునేందుకు అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో ఇన్‌చార్జిగా అప్పటికే కొనసాగుతున్న రావి రామ నాథంబాబు తననే కొనసాగించాలంటూ తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వైసీపీ చీరాల ఇన్‌చార్జి బాధ్యతలను కరణం వెంకటేష్‌కు అప్పగించారు.

ఈ దశలో ఇటీవల జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా పర్చూరు ఇన్‌చార్జిగా ఆమంచికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఆమంచి నియామకంపై అధికారిక ప్రకటన రావడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ క్రమంలో రావి అడుగులు ఎటువైపు ఉంటాయనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఆమంచి పర్చూరు వెళ్లిన తర్వాత ఆయన అనుచరులు చీరాలలో తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే అంశాలపై జోరుగా చర్చసాగుతోంది. ఈ దశలో పర్చూరు, చీరాల్లో జరుగుతున్న పరిణామాలను టీడీపీ శ్రేణులు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments