సమయ పాలన, ముక్కుసూటి తనం, నిష్కల్మషంగా ఉండాలన్నా ఎవ్వరికైనా కష్టమే. అయితే విజయనగరం జిల్లాకు కొత్తగా వచ్చిన డా.బీ.ఆర్.అంబేద్కర్ సమయ పాలన ముక్కుసూటి తనం ఈ రెండింటిని చూపించారు. ఇక విజయనగరం జిల్లా కేంద్రంలో ఈ వేదిక అనుకున్న ప్రకారం.పది గంటలకు ప్రారంభమైంది. సమయానికి పావుగంట ముందే వచ్చిన కొత్త కలెక్టర్ డా.బీ.ఆర్.అబేద్కర్ ఆడిటోరియంలో అధికారులు రావడాన్ని గమనించారు. సరిగ్గా పదిగంటలు కావడంతో ఆడిటోరియం గేట్లు మూసేసి వచ్చిన పది పదిహేను మంది అధికారులకు ఓ చిన్న పాటి క్లాస్ తీసుకున్నారు. సమయ పాలన పాటించాలని చెబుతూ తలుపులు ఎందుకు వేసానో చెప్పారంట కూడ. ఆడిటోరియం బయట సమస్యలు చెప్పుకునేందుకు బాదితులు ఉన్న కారణంగా తలుపులు వేయించానని చెబుతూ పది గంటలు దాటి ఆలస్యంగా వచ్చిన దాదాపు 30 మంది అధికారులకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, కలెక్టర్ నోటీసులు జారీ చేయడం విశేషం. ఇలాంటి కలెక్టర్ ఉంటే అధికారులలో అలసత్యం అల్లంత దూరన పోతుందని ఇక మిగిలిన జిల్లా అధికారులకు కలెక్టర్ తన మార్క్ పరిపాలన ఎలాఉంటుందో పరిచయం చేసినట్లు ఉంది. చూద్దాం అధికారుల్లో ఎంత మార్పు వస్తుందో
కొత్త కలెక్టర్ మార్క్ పరిపాలన… సమయపాలన పాటించని వారికి నోటీసులు…!
RELATED ARTICLES