మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ఆదివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పులి లక్ష్మీపతి గౌడ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్, ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్ తదితరులు కలిసి ఈనెల 11న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే గౌడ సోదరుల ఆత్మీయ సమావేశానికి రావాలని ఆహ్వానించారని మండల అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్ పేర్కొన్నారు. మంత్రిని కలిసిన కార్యక్రమంలో కోల నారాయణ గౌడ్, మర్తన్నపేట లక్ష్మణ్ గౌడ్, నిమ్మల వేణు గౌడ్, పందిర్ల సాయిరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు