మహిళలు విద్యార్థినిలు అన్యాయానికి గురైనప్పుడు షీ టీం ను ఆశ్రయించాలని షీ టీం పోలీసు సభ్యురాలు ప్రమీల అన్నారు. గురువారం నాడు ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులతో షీ టీం సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి సమాజం పట్ల తగు సూచనలు చేశారు. బాలికలు ఆకతాయిల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న తమ దృష్టికి తీసుకురావాలని షీ టీం సభ్యులు బాలికలకు తెలుపుతూ హెల్ప్ లైన్ నెంబర్ 87 126 56 45 నెంబర్ బాలికలకు తెలిపారు. సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లతో తగు జాగ్రత్తగా ఉండాలని బాలికలకు షీ టీం సభ్యులు సూచించారు. ఎవరైనా విద్యార్థినులు ర్యాగింగ్ కు ఈవ్ టీజింగ్ కు గురైన మహిళలు పనిచేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైన షీ టీం ను ఆశ్రయించాలని వారు తెలిపారు. లైంగిక వేధింపులకు ఎవరైనా గురైన నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని మరియు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ల గురించి కూడా బాలికలకు షీ టీం సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దూస గోవర్ధన్, ఉపాధ్యాయులు లక్ష్మీ, ప్రేమలత, రజిత, పి .వంశీధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజేందర్, విద్యార్థులు షీ టీం సభ్యులు ప్రియాంక, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.