కీవ్, మార్చి 9: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. గురువారం ఒక్కరోజే ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై 81 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఆరు కింఝల్ హైపర్‌సోనిక్ క్షిపణులతోపాటు 8 డ్రోన్లు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 10 రీజియన్లలో నివాస భవనాలు సహా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఆక్రమణదారులు పౌరులను భయభ్రాంతులకు గురిచేయగలరు. వారు కేవలం ఆ పని మాత్రమే చేయగలరు’’ అని పేర్కొన్నారు. ఈ దాడులను ఉక్రెయిన్ రక్షణశాఖ కూడా ధ్రువీకరించింది. గడిచిన మూడు వారాల్లో ఇదే అతిపెద్ద దాడి అని పేర్కొంది. తాము 34 క్షిపణులను, 4 షాహిద్ సూసైడ్ డ్రోన్లు, 8 డ్రోన్లు, గైడెడ్ క్షిపణులు లక్ష్యాలను చేరుకునేలోపే కూల్చివేసినట్లు వెల్లడించింది. రష్యా ఎల్వీవ్‌పై చేసిన రాకెట్ దాడిలో ఐదుగురు, డెనిప్రోపెట్రోవ్‌స్కపై జరిపిన క్షిపణి దాడిలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పశ్చిమ, దక్షిణ భాగాలపైనా రష్యా దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా
RELATED ARTICLES