ఎల్లారెడ్డి పేట గ్రామంలోని, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా, కృష్ణమూర్తి స్వామి, ఆలయ అర్చకులు నవీన్ చారి వారిచే పంచాంగ శ్రవణం గావించబడింది. కొత్త కుండలో చేసినటువంటి పచ్చడిని దేవునికి సమర్పించి, భక్తులకు పంచారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామి వారు మన గ్రామాన్ని, గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ నూతన సంవత్సరం లో అందిస్తారని వాణిని వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారి బంధారపు బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేగి నర్సయ్య, మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలురాజు యాదవ్, ఆర్థిక సలహాదారులు బండారి బాల్ రెడ్డి, ఆధ్యాత్మిక సలహాదారు ఈశ్వర్, ప్రధాన సలహాదారులు వంగ గిరిధర్, యువ సలహాదారులు పందిర్ల శ్రీనివాస్, మహిళా సలహాదారులు ఉదయమ్మ, స్రవంతి, శ్రావణి, భక్తులు పాల్గొన్నారు.