సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణ రావుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 300 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేసిన సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు ఈ రోజు శుభదినం మూడు పండుగలు ఒకేసారి జరుపుకుంటున్నాం ఒకటి మన గొప్ప పండుగ మహా శివరాత్రి అయితే రెండోది మహిళల పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మూడోది మీ మహిళందరికీ కుట్టు మిషన్లు ఇచ్చే పండుగ అన్నారు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన మాట ప్రకారం కొంత కష్టం అయినా మీకు కుట్టు మిషన్ లు పంపిణీ చేశాను. శిక్షణ తీసుకున్న మిగిలిన మహిళలకు కూడా త్వరలో మిషన్లు పంపిణీ చేస్తా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అనాలోచితంగా వ్యవహరిస్తోందన్నారు. గత ఎండాకాలం ఈ సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయించి చెరువుల్ని, కుంటల్ని, చెక్ డ్యామ్ లను నింపుకున్నాం నిండు ఎండా కాలంలో పంటలు ఎండిపోకుండా కాపాడుకున్నాం. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయమే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడుప్రచారం చేస్తూ నీళ్లు విడవడం లేదు నీళ్లు అందక రైతులు కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ప్రజా సమస్యలపై ప్రభుత్వం తో పోరాటం కొనసాగిస్తాం సిద్దిపేట ప్రజలు నాపై చూపిన ప్రేమను ఎన్నడూ మరిచి పోను సిద్దిపేట అభివృద్ది కోసం, ఇక్కడి ప్రజలను కాపాడుకోవడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా ఎంతదాకయినా కొట్లాడుతా మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అన్నారు