కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మినర్వా ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకేజీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ముత్యాల మురళీకృష్ణ, డైరెక్టర్ ఆర్.బి చౌదరి, ఫౌండర్ డివీఎస్ రమేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.బి చౌదరి మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రీ ప్రైమరీ దశ చాలా ముఖ్యమైనదని వివరిస్తూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలా ఓపికతో వ్యవహరించాలని తెలియజేశారు. ఫౌండర్ డివిఎస్ రాజు రమేష్ మాట్లాడుతూ చిన్నపిల్లల మదిలో తలెత్తే సందేహాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చాలా ఓపికగా నివృత్తి చేయాలని అలా చేస్తే వారిలో నైపుణ్యాలను మెరుగుపడతాయని వారి ప్రశ్నలకు విసుగు చెందకుండా వారి సందేహాలను నివృత్తి చేయాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మల్లిఖార్జున్, వైస్ ప్రిన్సిపాల్ మట్టపర్తి శ్రీ లక్ష్మణ్ కుమార్, భార్గవి,స్టెల్లా, పిటి శ్రీనివాస్, శివ పార్వతి, హసిత, లలిత, నీరజ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
మినర్వాలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
RELATED ARTICLES