జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం 1వ వార్డులోని ముద్రవేన ఇంద్ర అనే మహిళ ఇంట్లో నిన్న కురిసిన వర్షాలకు సాయంత్రం ప్యాన్ కాలిపొయి, దానికి ఉన్న వైర్ ఇంటి యొక్క స్లాబ్ సలాకల ద్వారా విద్యుత్ ప్రవహించింది, ఇంటి నిర్మాణంలో మెట్లుకు వొదిలిన సలాక పై తాటి కమ్మ పడగ దానిని తొలగించే క్రమంలో ఆ మహిళకు కరెంట్ షాక్ తగిలి క్రింద పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది, విషయం తెలుసుకున్న లైన్ మెన్ రౌతు వేణు గోపాల్, జూనియర్ లైన్ మెన్ మాచర్ల లక్ష్మన్ కు తెలియపరచగానే వెంటనే స్పందించి ఆ ఇంటికి వెళ్ళి ప్యాన్ నుంచి వెళ్లిన వైర్ ను తొలగించి, విద్యుత్ ప్రవేశించకుండా ఎర్త్ వైర్ ఏర్పాటు చేశారు. ఈ వర్ష కాలంలో విద్యుత్ వినియోగదారులు ఇనుప రేకుల షేడ్, మరియు ఇంటి ఐరన్ రాడ్ లకు విద్యుత్ వైర్ కట్టకుండా ప్లాస్టిక్ పైపుల ద్వారా విద్యుత్ సరఫరా చేసుకొవాలని కరెంటు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.