కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అజ్మీరా ఆత్మారాం నాయక్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు 2018 మరియు 2023 రెండు దఫాలుగా భారతీయ జనతా పార్టీ బీఫామ్ పై అసిఫాబాద్ నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. తను గురువారం తన రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి మరియు ప్రాథమిక కేఏసీల సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలు గిరిజనుల కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత నచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి గిరిజన ముద్దుబిడ్డ సీతక్క ఆశీస్సులతో జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. వారితో పాటు సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ గుగులోతు రవి నాయక్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహబూబ్ అలీ, సేవాలాల్ సేన జిల్లా నాయకులు జరుకుల తిరుపతి భారతీయ జనతా పార్టీ యువ నాయకులు మోహన్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు బోదాసు వెంకటి, సురేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.