రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలోని మైసమ్మ గుట్ట వద్ద గల ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి హాద్దులు పెట్టాలని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు శనివారం తహశీల్దార్ బోయిని రామచందర్ కు వినతిపత్రం సమర్పించారు, వెంటనే స్పందించిన తహాసిల్దార్ బోయిని రామచందర్ స్థల పరిశీలన చేయాలని ఆర్ ఐ సంతోష్ ను ఆదేశించారు. తహశీల్దార్ ఆదేశాలతో ఆర్ ఐ సంతోష్ శనివారం మైసమ్మ గుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వేయర్ ను సోమవారం పంపిస్తానని రైతులకు తాసిల్దార్ రామచందర్ హామీ ఇచ్చారు.
అనంతరం తాసిల్దార్ రామచందర్ ఎంపీడీవో సత్తయ్య లు ఇంటింటి సర్వేలో భాగంగా తిమ్మపూర్ గ్రామాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ రైతు సంఘం అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దండు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పద్ధతి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి అభ్యన్ భీమయ్య, సలహాదారుడు నమ్మిలకొండ సత్తయ్య, సభ్యులు దేవేందర్, చెక్కల సత్తయ్య, మాజీ ఎంపీటీసీ వరద బాబు, మాజీ సర్పంచ్ అమ్నా సీత్య నాయక్, గడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు,