బుధవారం జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తనుగుల గ్రామములో వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ కార్తీక్. ఈ వైద్య శిబిరంలో 48 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఇద్దరు జ్వర పీడితులను గుర్తించి, వారి రక్త పూతల నమునాలను సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించారు. గ్రామమస్తులకి మలేరియా, డెంగీ మరియు చికెన్ గున్యా మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించి చెప్పినారు. అసంక్రమిత వ్యాధులు మధుమేహం, రక్తపోటు వ్యాధుల గురించి అవగహన కల్పించి, అవసరం ఉన్న వారికి మందులు ఇచ్చారు. అంతేగాకుండా వారికి ఆహార అలవాట్ల గురించి, వ్యక్తి గత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే కార్యక్రమము చేపట్టి దోమల లార్వా లను నిర్ములించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమములో డాక్టర్ కార్తీక్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్స్ సదానందం, కుసుమకుమారి, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎం మణెమ్మ, సంపూర్ణ, పుష్పలత ఆశా కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


