ఎల్లారెడ్డి పేట గ్రామ రాజకీయాల్లో గత మూడు దఫాలుగా రాజకీయంగా వార్డు సభ్యులు గా, ఎంపీటీసీ గా, ఉపసర్పంచ్ గా మీ కుటుంబము చేసిన సేవలు అభినందనీయమని ఎల్లారెడ్డి పేట మండలం కోరుట్ల పేట వాస్తవ్యులు చొప్పదండి శాసన సభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ లో గల చొప్పదండి శాసన సభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం ను ఎల్లారెడ్డి పేట తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు కుటుంబ సభ్యులు స్వగృహంలో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. మీ కుటుంబం రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదుగుతుండడం హర్షించదగిందని డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజావసరాలను గుర్తించి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో క్రియాశీల పాత్ర పోషించడంలో వెనుకంజ వేయకూడదని, వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుందని అదే విధంగా మన ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుందని అన్నారు.