అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన రేండ్ల లింగంయాదవ్ రేణుక వీరిది నిరుపేద కుటుంబం ఆ దంపతుల కుమార్తె రేవతి వివాహనికీ ఎల్లారెడ్డీపేట మండల సామాజిక కార్యకర్త, మాజీ సర్పంచ్ మమత -వెంకటరెడ్డి ఈరోజు పుస్తె, మెట్టెలు వితరణ చేశారు. ఇది 1041 వ పుస్తెమట్టెల వితరణ. ఈ కార్యక్రమంలో M. P. P. పిల్లి రేణుక కిషన్, రెడ్డి సంఘం ప్రతినిధులు ఉచ్చిడి తిరుపతి రెడ్డి, నాగేల్లి వెంకట్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు నక్క కిషన్, పెద్దవేణి, శ్రీనివాస్, రేండ్ల చంద్రం, రేసు రాములు, పందిళ్ల శ్రీనివాస్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.