ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కరికేనాంపల్లి ప్రమాదవశాత్తు బైక్ ఢీ కొట్టి మృతి చెందగా తన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన విజ్ఞప్తికి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో పాటు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 30,000/- (ముప్పై) వేలరూపాయల ఆర్థిక సాయం మరియు 1 క్వింటాల్ బియ్యాన్ని అందించడం జరిగింది. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని భరోసాని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, ఆగుళ్ల రాజేశం, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజాన్ నరేష్, తాళ్ల విజయ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు షీలా ప్రశాంత్, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎదునూరి భానుచందర్, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి మిడిదొడ్డి భాను, పట్టణ ఉపాధ్యక్షులు ఎద్దండి మహేందర్ రెడ్డి, దుబ్బాక రాజు, తలారి నర్సయ్య, నల్ల బుచ్చయ్య, వెంకటి, వడ్లకొండ భరత్, ముచ్చర్ల శ్రీనివాస్, కొండయ్య, సారుగు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.