ఈ రోజు కామారెడ్డి నుండి కరీంనగర్ ఆర్టీసి బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడు లగేజ్ మర్చిపోయాడు. అందులో డబ్బులు బంగారం విలువైన వస్తువులు కూడా వున్నాయి. విధులు నిర్వహిస్తున్న ఆ బస్సు డ్రైవర్ తన నిజాయితీ నీ చాటి ఆ లగేజి ని విలువైన వస్తువులు ఎవరివో తెలుసుకొని వాటిని ప్రయాణికుడి దగ్గరికి చేర్చారు. ఆర్టిసి డ్రైవర్ గొల్లపల్లి రాజు చూపించిన నిజాయితీ ని మానవతా దృక్పథం చాటిన డ్రైవర్ ని అభినందిస్తూ BRS విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ పాత బస్టాండ్ లో వారిని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి సిబ్బంది తన తోటి డ్రైవర్స్ కూడా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్టాండ్ కంట్రోలర్ రాజయ్య కార్గో లా జిస్టిక్స్ డి ఎం ఈ శేఖర్ కండక్టర్ రమేష్ ఆర్టీసీ సిబ్బంది పరమేష్ అజయ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.