రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటమ్ కుమార్ గత 45 రోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయి మరణించారు. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, ప్రమాద బీమా ను హైదరాబాద్ తెలంగాణ భవన్ లో అప్లై చేయగా ఈ రోజు తెలంగాణ భవన్ ఇంచార్జ్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పెంటన్ కుమార్ భార్య పెంటమ్ సోనీకి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రోస్డింగ్ కాపీని అందజేసిన బీఅరెస్ పార్టీ స్థానిక నాయకులు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పందిళ్ళ పరశురాం గౌడ్, ఎడ్ల సందీప్, చందనం శివరామకృష్ణ, మహమ్మద్ సల్మాన్, కార్తీక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.