కామారెడ్డి MLA క్యాంపు కార్యాలయములో ఇటీవల పడ్డ వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల పంట పరిహారం విషయమై కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల పడ్డ వడగళ్ల వానకి నష్టపోయిన పంట వివరాలు అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి తీసుకోవాల్సి ఉండగా కలెక్టర్ తో సహా ఎవ్వరూ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళడం లేదని, ప్రకృతి వైపరీత్యాల విషయంలో సహాయ కార్యక్రమలకు ఎన్నికల కోడ్ ఏమి అడ్డు రాదని అన్నారు. నిన్న ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులను పరామర్శించారు ఆనందదాయం అని కానీ వారు చెప్పినట్టుగా పంట నష్టం జరిగిన ప్రతి రైతుకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారం రైతుల ఎంపిక విషయంలో ఏ ఒక్క రైతును విస్మరించినా ఊరుకునేది లేదని గత KCR ప్రభుత్వం పోయిన సంవత్సరం పంట నష్టపోయిన రైతులకు ఉద్యమం అనంతరం ఏకరాకు 10 వేల రూపాయలు నష్ట పరిహారం ప్రకటించినా రైతులకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదనీ ఈసారి అదే కథ పునరావృతం అయితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. విద్యుత్ శాఖాధికారులు పంట పొలాల్లో పడిపోయిన స్తంభాలు, ఇతర నష్టాలకు రైతుల నుండి డబ్బులు తీసుకోకుండా త్వరితగతిన విద్యుత్ పునరుద్దరణ చేయాలని, రైతుల నుండి డబ్బులు అడగవద్దని సూచించారు.