రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో 26-01-2025 ఆదివారం రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు షేక్ సాబేరా బేగం గౌస్ చే గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల చిన్నారులకు బుక్స్ పెన్సిల్స్ అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు పొన్నాల తిరుపతిరెడ్డి, దారవత్ గణపతి, గుల్లపల్లి లక్ష్మారెడ్డి, గంట చిన్న లక్ష్మి, మర్రి నారాయణరెడ్డి, చిట్టి బాలయ్య, మేడిపల్లి రవీందర్, కొంగరి కృష్ణారెడ్డి, ముత్యాల సత్యనారాయణ రెడ్డి, సుడిది రాజేందర్, మరియు మార్కెట్ కమిటీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు



