Monday, November 2, 2026
spot_img
HomeANDHRA PRADESHతుమ్మలచెరువు ZPHS ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు

తుమ్మలచెరువు ZPHS ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు

మార్కాపురం జిల్లా తర్లపాడు మండలం తుమ్మల చెరువు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నైట్ వాచ్మెన్ గా గత కొన్ని నెలల ముందు బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి దాదాపు 18 రోజుల నుండి తన విధులకు రాకపోనందున తుమ్మలచెరువు గ్రామ ప్రజలు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలికి తెలపగా వారు వాచ్మెన్ తన విధులు నిర్వహించడం లేదని ప్రశ్నించగా ప్రధానోపాధ్యాయులు దానికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా గతం కంటే ఇప్పుడు పనులు సక్రమంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఆ హైస్కూల్ కు సంబంధించిన దాదాపు 20 నుండి 30 లక్షల రూపాయల విలువ గల ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి నైట్ వాచ్మెన్లను నియమించగా వారిని విధుల్లో ఎందుకు రావడం లేదు అని ఆడగకుండా తమ తప్పులను కప్పి పుచ్చుకుంటున్నారని ఒక బాధ్యత గల వ్యక్తి తమ విధులు సక్రమంగా నిర్వహించకపోతే ప్రభుత్వ సంపదకు నష్టం వాటిల్లదా అంటూ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మండల విద్యాశాఖ అధికారికి తుమ్మల చెరువు హెడ్మాస్టర్ పై ఫిర్యాదు చేశారు. మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారికి, మార్కాపురం ఇన్చార్జ్ కలెక్టర్ కి తుమ్మలచెరువు ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు కావున వీరిపై చర్య తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments