కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి పథకం, (ఉచిత విద్యుత్) ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అధికారికంగా ప్రారంభించారు. గన్న శ్రీనివాస్ రెడ్డి S/o పెద్ద రాములు ఇంటికి జీరో కరెంట్ బిల్లు ఇచ్చిన విద్యుత్ శాఖా సిబ్బంది. ఈ సందర్భంగా ఇంటి యజమాని గన్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత విద్యుత్తు (జీరో కరెంట్ బిల్), రావడం పట్ల మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ జీరో కరెంట్ బిల్ వల్ల మా కుటుంబానికి నెలకు సుమారు రూ. 500 నుంచి రూ. 900 వరకు ఆదా అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసన్న, ఎల్లారెడ్డి పేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ఉపాధ్యక్షులు గంట బచ్చా గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు భానోత్ రాజు నాయక్, అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అంతెర్పుల గోపాల్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫిక్, సీనియర్ నాయకులు గుర్రపు రాములు, కనకరాజు సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణారెడ్డి, ఎంపీటీసీ 2 ఎనగందుల నరసింహులు అనసూయ, సతీష్, బండారి బాల్రెడ్డి, చందు, ధర్మేందర్, రవి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజ్ కుమార్ పాల్గొన్నారు,