చెన్నై: తిరుప్పూరు సమీపం అంగేరిపాళయంలోని మహాకాళియమ్మ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగం గా మంగళవారం ఉదయం తీర్థ కలశాల ఊరేగింపు జరిగింది. అవినాశి లింగేశ్వర ఆలయం నుంచి మహాకాళియమ్మ ఆలయానికి పవిత్ర తీర్థాలను తీసుకువచ్చారు. ఆ తీర్థాలను కలశాలలో నింపి భక్తులు ఊరేగింపుగా ఆలయం వద్దకు చేర్చారు. ఆ సందర్భంగా తిరుప్పూరు నార్త్ అన్నాడీఎంకే శాసనసభ్యుడు కేఎన్ విజయకుమార్ పసుపు ధోవతి ధరించి తలపై పవిత్ర జలకలశాన్ని పెట్టుకుని వేపాకుల మండ పట్టుకుని భక్తులతో కలిసి నృత్యం చేస్తూ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్ళారు. కలశాలను కిందకు దింపిన తర్వాత ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.