ఇండియన్ ఎంబసి ద్వారా కంభోడియా పోలీసుల సహాయంతో సోదాలు చేసి బాధితుడిని సిరిసిల్ల పోలీసులు కాపాడారు. కొంబోడియా దేశం లో ఛైనిస్ కు సంబంధించిన కంపెనీలో సైబర్ మోసాలు చేపిస్తున్న ముఠాను సిరిసిల్ల పోలీసులు పట్టుకొని శనివారం ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రెస్ మీటు నిర్వహించారు. కంభోడియాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇండియా నంబర్ కీ కాల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నాట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు