ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం లో కీలక ట్విస్ట్ వెలుగు చూసింది. లిక్కర్ స్కాం లో ప్రవీణ్ గొరకవి అనే మరో హైదరాబాదీ పేరు తెర మీదకు వచ్చింది. స్కాంలో నిధులు మళ్లింపుపై ఈడీ ఛార్జ్ షీట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. దుబాయ్ కంపెనీతో పాటు ‘ ఫై ‘ కంపెనీ కి నిధులు మళ్లించారు. ఫై కంపెనీకి ఫౌండర్‌గా ప్రవీణ్ ఉన్నారు. సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ పాత్రపై లోతుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. స్కాంలో నిధుల్ని హవాలా రూపంలో ప్రవీణ్ కుమార్ కంపెనీకి మళ్లించినట్టు ఈడీ అభియోగం మోపుతోంది. ప్రవీణ్ కుమార్ ఇంటిపై గతంలోనూ ఈడీ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే రూ.24 లక్షలను ఈడీ స్వాధీనం చేసుకుంది.