విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాలలో ఇప్పటికే పోలీసుల పని తీరుపై విమర్శలు వస్తున్న తరుణంలో సాక్షాత్ హోం మంత్రి బంధువు వౄహికల్ ఒకటి భక్త జన సందోహానికి అడ్డంగా రావడం సంచలనమైంది. నగరంలో గంటస్థంభం నుంచీ మూడు లాంత్ల వరకు ఒక్క వెహికల్ రాకూడదని ఇప్పటికే పోలీసులు ఆదేశాలతో పాటు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ముందు రోజు సాయంకాలం రాష్ట్ర హోం మంత్రి అనిత రావడం, అమ్మను దర్శించుకోవడం అక్కడ నుంచీ అయోధ్యా మైదానంకు ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే తెల్లారేసరికి పైడితల్లిని వీవీఐపీలందరూ దర్శించుకోవడం పూర్తయినా సరిగ్గా గంటస్థంభం వద్ద ఓ ఇన్నోవా కారోకటి అడ్డంగా గంటల తరబడి కదలకపోవడంతో సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఏఎస్ఐ రామకృష్ణ వచ్చి ఇక్కడ నుంచీ వెహికల్ తీయ్యాలని గట్టిగా చెప్పడంతో కదిలిందా వాహనం. ఇంతకీ ఆ వాహనం నిజంగా హోం మంత్రి బంధువుదేనా…? తెలియాల్సి ఉంది.
రోడ్ మధ్యలో హోం మంత్రి బంధువు వాహనం….!
RELATED ARTICLES