అమరావతి: డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దుపై హైకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దుచేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసింది. 318 డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దుచేస్తూ ఏపీ సర్కార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీల గుర్తింపు రద్దుపై హైకోర్టును యాజమాన్యాలు ఆశ్రయించారు. అయితే ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. ఎన్‌సీటీఈ భవిష్యత్‌లో ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కాలేజీల యాజమాన్యాలు సకాలంలో రిప్లై ఇవ్వాలని హైకోర్టు సూచించింది. అలాగే డీఈడీ కాలేజీలన్నీ గుర్తింపు పొందినట్టేనని హైకోర్టు పేర్కొంది.
ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
RELATED ARTICLES